** TELUGU LYRICS **
హృదయములోని భయములకు అభయపు హస్తము చూపావు
మంచి నేలలో నాటావు అన్నివేళలా దాచావు
సంద్రం తీరమున ఆ ఇసుకను మించిన
దీవెనలెన్నో నాపై కురిపించావు
స్వరమండలములతో నిత్యము పొగడెదను
మ్రోగిడి తాళాలతో నిను ఆరాధించెదను
||హృదయములోని||
మంచి నేలలో నాటావు అన్నివేళలా దాచావు
సంద్రం తీరమున ఆ ఇసుకను మించిన
దీవెనలెన్నో నాపై కురిపించావు
స్వరమండలములతో నిత్యము పొగడెదను
మ్రోగిడి తాళాలతో నిను ఆరాధించెదను
||హృదయములోని||
నీరు కట్టిన తోటవలె నా కాలమందు ఫలియించుటకు
గర్భములో ఉన్నప్పుడే నాపేరుతొ పిలిచితివి (2)
దూతలకంటే యోగ్యునిగా నన్ను చేయుటకు
నీ పాదదాసునిగా జీవించే ధన్యతనిచ్చావు
||స్వరమండలములతో||
తగులుచున్న గాయాలన్నీ మానిపోయిన దినములలో
ఎరిగితిననీ సమస్తము నీ చిత్తములోనివని (2)
ఆకాశమందలి జ్యోతిగ నన్ను చేయుటకు
శ్రేష్ట మార్గమును బోధించి నా దిశనే మార్చావు
||స్వరమండలములతో||
లోకములోని మహిమలను భోగభాగ్యాల ఆశలను
విరుచుటకు భుజములపై నీ కాడిని మోపావు (2)
అపవాది తంత్రములు ఎదురించే శక్తిగ చేయుటకు
వాక్య ఖడ్గమును నాలో ఉంచి బరిలో దింపావు
||హృదయములోని||
విరుచుటకు భుజములపై నీ కాడిని మోపావు (2)
అపవాది తంత్రములు ఎదురించే శక్తిగ చేయుటకు
వాక్య ఖడ్గమును నాలో ఉంచి బరిలో దింపావు
||హృదయములోని||
----------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
----------------------------------------------