4685) నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ

** TELUGU LYRICS **

నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ 
నేను విడచిపోయిన నను విడువని నీ ప్రేమ 
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా 
||నీ ప్రేమే||
 
మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ 
నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ (2)
విలువైనది నీ కృప నను పిలచిన నీ కృప (2)
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
||నీ ప్రేమే||

అమ్మ పంచనిది నాన్న  చూపనిది నీ ప్రేమ 
నే లోకమంతయు వెదకినా దొరకని నీ ప్రేమ (2)
నాకై వచ్చితివి నను ప్రేమతో పిలచితివి  (2)
నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 
నా కొరకొచ్చినా నజరేయుడా (2)
నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
||నీ ప్రేమే||

------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Sung : Shyam Joseph 
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------------