4682) ఆపత్కాలమందు యెహోవా నన్ను ఆదుకొనెనుగా

** TELUGU LYRICS **

ఆపత్కాలమందు యెహోవా
నన్ను ఆదుకొనెనుగా                 
ఆహా.. హల్లేలుయా పాడెదా
ఆహా.. హోసన్నా నే పాడెదా

పరిశుద్ధ జీవితమునే వాంఛిచగా 
యిహాలోక ఆశలు నన్నుచుట్టుకొనెనుగా                     
పరిశుద్ధ స్థలమువైపు నే చూడగా 
సమాయోచిత సహాయం దొరికెనుగా ఆ.. ఆ.. ఆ..

విశ్వాస జీవితములో సాగుచుండగా                             
నా సొంతవారే నన్ను గేలిచేయగా  
పిలిచిన నీ వైపే నే చూడగా            
నీ గొప్ప ఆదరణ పొందితిగా ఆ..ఆ.. ఆ..

నా ప్రాణ ప్రియుడా నీ రాక కోసమే                                          
నీ మూల్గు చుంటిని గువ్వ వలే 
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచరు      
కనిపెట్టు కొందును నీ వధువుగా ఆ.. ఆ.. ఆ..

-----------------------------------------------------------
CREDITS : Music : Verpula Nikhil Paul
Lyrics,Tune, Vocal : Abigail Daniel
-----------------------------------------------------------