** TELUGU LYRICS **
శ్రేష్ఠమైన శ్రీకరుడా ఆదరించు నాధుడా
వేల్పులలో మహాఘనుడా విశ్వానికి నిర్మానికుడా (2)
నీవంటివారెవ్వరు నీతో సమమేవ్వరు
నీవంటి వారెవ్వరు నీతో సమమేవ్వరు
కలతల కెరటములో కలవరముతో నుండగా
కన్నీరు తుడిచితివే నా కన్న తండ్రివైతివే (2)
నీతో నేను ఉండాలని నా స్థితినే నీవు మార్చితివే (2)
నాకెడెము దుర్గము ధైర్యము నీవే నీవే యేసయ్య (2)
నా స్తుతి గీతములు నీకే నా స్తుతి ఆరాధన నీకే (2)
నీ మహిమ ప్రభావముతో ప్రకాశింపజేసితివే
శ్రేష్ఠమైన ఫలములతో నన్ను తృప్తిపరచితివే (2)
నీలో నేను ఉండాలని నీ కృపలో నన్ను దాచితివే (2)
నా కాపరి మేపరి ఊపిరి నీవే నీవే యేసయ్య (2)
నా స్తుతి అర్పణలు నీకే నా స్తుతి దుపములు నీకే (2)
నీ ఆశ్రయ పురమునకు వారసుని చేయుటకే
సద్గుణ శీలుడవై నను పరిశుద్ధ పరచితివే (2)
నిత్యము నీతో ఉండాలని నా అడుగులు నీలో నిలిపితివే (2)
నా మార్గము గమ్యము గమనము నీవే నీవే యేసయ్య (2)
నా స్తుతి స్తోత్రములు నీకే నా స్తుతి స్తోత్రాంజలి నీకే (2)
--------------------------------------------------------------
CREDITS : Music : Gotikala Joshua
Tune, Lyrics, Vocals : U.Nireeshana Rao
--------------------------------------------------------------