4650) నిన్నే నేను ప్రేమించాలయ్యా నీ ప్రేమలోనే జీవించాలయ్యా

** TELUGU LYRICS **

నిన్నే నేను ప్రేమించాలయ్యా నీ ప్రేమలోనే జీవించాలయ్యా
నిన్నే నేను ప్రేమించాలయ్యా యేసు - నీ ప్రేమలోనే జీవించాలయ్యా క్రీస్తు (2)
నిన్నే పోలి నేను నడవాలి నీ రూపంలోకి నేను మారాలి 
నిన్నే చూస్తూ నీలా అవ్వాలి - నిన్నే వెదకి నీతో చేరాలి
నీ ప్రేమలోనే ఫలియించాలయ్యా యేసు - నీ ప్రేమలోనే తరియించాలయ్యా క్రీస్తు నిన్నే

నీలానే నే కృపనే చాటాలి - నీలానే నే కరుణే చూపాలి 
నీలానే నే సత్యం చెప్పాలి - నీలానే నే సాక్షిగా మారాలి
నీ ప్రేమ లోతు నిత్యం ఎరగాలి యేసు - నీ ప్రేమ కల్గి సత్యం చెప్పాలి క్రీస్తు నిన్నే 

నీలానే నేను ప్రేమించాలి - నీలానే నేను క్షమియించాలి
నీలానే నే ప్రేమను పంచాలి - నీలానే నే క్షమనే చూపాలి 
నీలా నేను మాదిరి కావాలి యేసు - నీలా పరిమళ వాసన అవ్వాలి క్రీస్తు  

నీలానే నే త్యాగం చేయాలి నీలానే నా సర్వం ఇవ్వాలి 
నీలానే నిస్వార్ధంగుండాలి నీలానే నా ప్రాణం ఇవ్వాలి
నీలా ఏ కపటము లేకుండా యేసు - నీ మనసే కల్గి జీవించాలి క్రీస్తు నిన్నే

--------------------------------------------------------------------------------
CREDITS : Music : KY Ratnam 
Lyrics, Tune & Vocals : Sampath Kumar Shanigaram
--------------------------------------------------------------------------------