4651) ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా

** TELUGU LYRICS **

ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా (2)
నను చెరుపుటే నీ ధ్యేయమా నను భక్షించుటే నీకానందమా (2)

ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో 
ఎన్నోవాటితో నన్ను కదలకుండా కట్టేసినావు (2)
కొంచమైన జాలి నాపై చూపకుండా (2)
వింత వింత విందులలో ఉత్సహించినావు (2)
||ఓ దేహమా||

కన్నులలోని కెమెరా పాపాన్నే చూస్తున్నది (2)
ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది (2)
చూసినవి చేసేదాకా వదలనన్నది (2)
చేసినవెంటనే నిందిస్తు ఉన్నది (2)
||ఓ దేహమా||

దేహమెందుకున్నదో శరీరరం మరిచియున్నది (2)
ఆత్మకు శరీరమెప్పుడూ సహకరించనంటున్నది (2)
బానిసలా నన్ను మార్చుకున్నది (2)
భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది (2)
||ఓ దేహమా||

ఆత్మను నరకానికి పంపుతున్నది పరలోకంలో ఉన్న దేవునికి కన్నీరే మిగిల్చుచున్నది అందుకే 

ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా (2)
నను చెరుపుటే నీ ధ్యేయమా నను భక్షించుటే నీకానందమా (2)

-------------------------------------------------
CREDITS : Raju Nelapatla
Vocals : NIssi John
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------