** TELUGU LYRICS **
గమ్యం తెలియని ఓ మానవా ఒకసారీ యోచించవా (2)
సమయం చాలా విలువైనది - నీ హృదయం క్రీస్తుకు (యేసుకు) అర్పించవా (2)
చాచిన చేతులతో యేసు నిన్నే పిలచుచున్నాడు (2)
రమ్ము ఓ సోదరా యేసుని స్వీకరించుము
రమ్ము ఓ సోదరీ క్రీస్తుని స్వీకరించుము
సమయం చాలా విలువైనది - నీ హృదయం క్రీస్తుకు (యేసుకు) అర్పించవా (2)
చాచిన చేతులతో యేసు నిన్నే పిలచుచున్నాడు (2)
రమ్ము ఓ సోదరా యేసుని స్వీకరించుము
రమ్ము ఓ సోదరీ క్రీస్తుని స్వీకరించుము
||గమ్యం||
నశీయించే ఈ లోకంలో జీవించవూ కలకాలం (2)
నీకై ప్రాణం పెట్టిన యేసుని - దరిచేరుమా ఈ క్షణమే (2)
యేసే మార్గము సత్యము నిత్య జీవము (2)
||రమ్ము||
అశాశ్వతం ఈ లోకం - స్థిరము కాదు కలకాలం (2)
శాశ్వతమైనది పరలోకం - లోకాశలన్నీ వీడుమా (2)
యేసే మార్గము సత్యము నిత్య జీవము (2)
||రమ్ము||
ఇరుకులు ఇబ్బందులెదురైనా - విశ్వాస యాత్ర సాగించుమా (2)
పరిశుద్ధుల స్వాస్థ్యము కొరకై - నేడే నీవు సిద్ధపడుమా (2)
యేసే మార్గము సత్యము - నిత్య జీవము (2)
||రమ్ము||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------