** TELUGU LYRICS **
సర్వయుగాలలో జగజగాలలో
మారనివాడవు నీవెనయ్య
యెహోవా నీవు నీతిమంతుడవు
మారనివాడవు నీవేనయ్య
యెహోవా నీకు సాటి ఎవ్వరూ
ఏమని వర్ణీంతు నీ ఘనకార్యములను
ఏమని వివరింతు నీ శూర కార్యములు (2)
ఉన్నవాడవు అనువాడవు - రానున్న నా యేసయ్య (2)
మారనివాడవు నీవెనయ్య
యెహోవా నీవు నీతిమంతుడవు
మారనివాడవు నీవేనయ్య
యెహోవా నీకు సాటి ఎవ్వరూ
ఏమని వర్ణీంతు నీ ఘనకార్యములను
ఏమని వివరింతు నీ శూర కార్యములు (2)
ఉన్నవాడవు అనువాడవు - రానున్న నా యేసయ్య (2)
రాజులు యుక్తిగా నడచితిరి విషచూపునే మాపై చూపితిరి
కన్నీటికి కరిగే దేవుడవు నీ ప్రజల మొఱ్ఱకు దిగి వచ్చావు (2)
చూసావయ్యా మా బాధను చాచావయ్యా యేసు నీ చేతిని (2)
పగలు మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్థంభముగా
ఆకలి వేళలో మన్నాగా దాహము తీర్చిన ఊటగ (2)
కాచావయ్య కాపరివై దాచావయ్య యేసు నీ నీడలో (2)
చిక్కటి చీకటి ఉరుములలో గర్జించు సింహపు అరుపులలో
మెల్లని చల్లని స్పర్శలతో ఇమ్మానుయేలువై తోడున్నావు (2)
ఉన్నావయ్య మా తోడుగా ఉన్నావయ్యా యేసు మా నీడగా
ఉన్నావాయ్యా మా అండగా ఉన్నావాయ్య యేసు మా కోటగా
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------