** TELUGU LYRICS **
స్నేహితుడా నా ప్రాణప్రియుడా
నా చెలికాడా నాతో ఉన్నవాడా
నీకే నీకే స్తోత్రముల్ నా యేసయ్యా
నీకే నీకే స్తోత్రముల్ నా యేసయ్యా
నీకే నీకే స్తోత్రముల్ ఆరాధ్యుడా
నీకే స్తుతి స్తోత్రముల్
నీకే స్తుతి స్తోత్రముల్
||స్నేహితుడా||
పాపములో నేనుండగా నీ ప్రాణమిచ్చితివి
లోకప్రేమ కంటే మిన్నగా నన్ను హత్తుకొంటివే
ప్రేమా స్వరూపుడా మహిమాన్వితుడా
||నీకే నీకే||
కష్టములో ఆశ్రయించగా అభయమిచ్చి ఆత్మతో నింపి
నా భయములు తొలగించి నీదు కృపతో నింపితివే
బలవంతుడవగు దేవా పరిశుద్ధాత్ముడా
||నీకే నీకే||
మేలుకోరి గాయపరచగా నీ సన్నిధిలో నిలువగా
నీ చిత్తము నేర్పించి మిత్రుడవై కాపాడితివే
ఆశ్చర్యాకరుడా ఆలోచన కర్తా
||నీకే నీకే||
నా దీనస్థితిలోనే నన్నాదరించితివి
సిద్దులతో నను చేర్చి నీవలె మార్చుకొంటివే
అనంత జ్ఞానుడా సర్వశక్తుడా
||నీకే నీకే||
------------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
------------------------------------------------