4630) నమ్మదగిన దేవుడా నా మంచి దేవుడా నీలాంటి ప్రేమను చూపేదేవరయ్యా

** TELUGU LYRICS **

నమ్మదగిన దేవుడా నా మంచి దేవుడా (2)
నీలాంటి ప్రేమను చూపేదేవరయ్యా 
నాకున్న ఆధారం నీవే యేసయ్యా (2)
||నమ్మదగిన||

ఆప్తులు అందరు నన్ను మరచిరే 
మాటలతో మనస్సును గాయపరచిరే (2)
మనస్సులో వేదన మదిని తొలచగా
మానని కన్నీరే నేలపై రాలేనే (2)
నా తండ్రి యేసయ్యా నా తోడు నిలిచితివే 
నా తోడు నిలిచితివే కన్నీరు తుడిచావు 
||నమ్మదగిన||

మంచివారు లేక మధన పడితినే 
నోటమాట రాకా మౌనినైతినే (2)
మనుష్యులు ప్రేమలు మలినమయేనే 
రంగులలోకములో మాయా ప్రపంచములో (2)
నా మంచి యేసయ్యా నీ ప్రేమ చూపితివే 
నీ మంచి మాటలన్ని నా నోట ఉంచితివే 
||నమ్మదగిన||

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Israel 
Music & Vovals : Jk Christopher & Lillian Christopher
---------------------------------------------------------------------------------