4628) సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును

** TELUGU LYRICS **

సరిపోల్చగలనా నీ ప్రేమను 
వివరించగలనా నీ మేలును (2)
నీవేగా నా క్షేమము కాచావు గతకాలము 
నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము 
వర్ణించలేను యేసయ్య - కీర్తింప ఉండలేనయ్య (2)
||సరిపోల్చగలనా||

అందరు విడిచి - ఒంటరినైతిని 
ఆదరణే కరువై - కుమిలిపోతిని (2)
ఆశ్రయుడా నీవు తోడుండగా - ఒంటరితనమైన ఓ వేడుకే 
అనుదినము నీవు నడిపించగా - ఎడారి మార్గమైన ఆనందమే 
ఊహించలేను యేసయ్య - నీవు లేని నా జీవితం (2)
||సరిపోల్చగలనా||

కుదరని వ్యాధి - విడువని వేదన 
జీవితమే బరువై -విసిగిపోతిని (2)
వైద్యుల కంటే మహనీయుడవు - స్వస్థతనిచ్చే జీవధాతవు 
కడవరకు నీపై విశ్వాసమే - ఊపిరి ఆగిన అది విజయమే 
లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో (2) 
||సరిపోల్చగలనా||

ప్రార్ధించగానే నా చెంతచేరి 
కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? (2)
పరిస్ధితులేవైనా నను విడువక - ఓ మంచి స్నేహమై నిలిచావుగా 
శోధనలన్నిటిలో బలశౌర్యమై - శత్రువు కోటలన్ని కూల్చావుగా 
ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు (2)
||సరిపోల్చగలనా||

-----------------------------------------------------------
CREDITS : Music : Bro.Immi Johnson   
Lyricys, Tune, Vocals : Pas. sagar
-----------------------------------------------------------