** TELUGU LYRICS **
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా - విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే - లోకరక్షకుడా
ఆనందింతు నీలో - జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య
పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా
-------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album (34) : Nityatejuda (నిత్యతేజుడా)
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------------------------