** TELUGU LYRICS **
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్ (2)
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)

బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ (2)
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)
నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు (2)
నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)
------------------------------------
CREDITS : Jesus Calls
------------------------------------