4616) మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి

** TELUGU LYRICS **

మితిలేని ప్రేమను చూపితివి
మమ్ము గతకాలమంతయు కాచితివి
క్షితిలోన మమ్మును విడువక
సంరక్షించిన నా యేసయ్య
వరముగ మాకిచ్చావయా ఈ నూతన సంవత్సరము
విరివిగ నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు

నా కాల గతులు నీ వశం
నీ కృపా క్షేమములే నాకు బలం
నీ రెక్కలే నాకు ఆశ్రయం
సజీవినై ధరలో ఉండుటే నాకు వరం
వరముగ మాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము
విరివిగ నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు

దేవా నీ ఉద్దేశములే క్షేమకరం
నాలో నీవుండుటే మహిమకరం
నీ సంకల్పములే మేలుకరం
నీ వాగ్దానములన్నియు శుభకరం
వరముగా మాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము
విరివిగ నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు

జగతిలో జరిగిన మారణహోమం
ఆవిరివలె అంతరించిరి ఎందరోజనం
మనము లయముకామని పలికిన దైవం
దీవించి ఇచ్చెను మనకు ఈసంవత్సరం
వరముగ మాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము
విరివిగ నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు

మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి
క్షితిలోన మమ్మును విడువక
సంరక్షించిన నా యేసయ్య
వరముగ మాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము
విరివిగ నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు

---------------------------------------------------------------
CREDITS : Music : Danam Cary Rayapati
Lyrics, Tune : Sis. Grace Mani 
---------------------------------------------------------------