** TELUGU LYRICS **
ఉత్సవం చేయుదము సంవత్సరమంతయును
ప్రభు యేసుని కొనియాడుచు ఎల్లప్పుడు కీర్తించేదo
జనులారా రండి ప్రభు వాక్యము ప్రభలమై ప్రతీ చోట వ్యాపించెను
జనులారా రండి భయభక్తులు కలిగి దేవుని సేవించేదం
ప్రభు యేసుని కొనియాడుచు ఎల్లప్పుడు కీర్తించేదo
జనులారా రండి ప్రభు వాక్యము ప్రభలమై ప్రతీ చోట వ్యాపించెను
జనులారా రండి భయభక్తులు కలిగి దేవుని సేవించేదం
ఆదిలో ఉండిన ఆ వాక్యము - మనకు దేవుడై యుండెను
వాక్యమే శరీరధారియై - కృపాసత్యసంపూర్ణునునిగా "మనతో నివసించెను"
జనులారా రండి జీవపు వెలుగును వెంబడించేదము
జనులారా రండి కృప వెంబడి కృపను పొందుచు సాగేదము
ఏ భేదము లేదు ఎవ్వరికీ - యేసే దేవుడు అందరికి
వాక్యమే నమ్మతగినదై - పూర్ణాంగీకారమునకు యోగ్యమై "మనలను రక్షించెను"
జనులారా రండి దేవుని సన్నిధిలో మొకరిల్లేదము
జనులారా రండి యేసయ్య నామమునే ఆరాధించేదము
ఆదిమ సంఘపు దినములలో - శిష్యులు దైవాత్మను పొంది
(జీవ)వాక్యమునే చేతపట్టుకొని - నిత్యము సువార్త ప్రకటించుచు "యేసుతోనే నడచిరి"
జనులారా రండి యేసయ్య త్వరగా రానైయున్నడు
జనులారా రండి దేవుని రాజ్యముకై సిద్దపడేదము
---------------------------------------------------------
CREDITS : Music : K Samuel Mories
Lyrics, Tune & Vocals : Bro. Srinivas
---------------------------------------------------------