4632) ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా అందరు నను విడిచి దూరంపోతున్నా

** TELUGU LYRICS **

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా
అందరు నను విడిచి దూరంపోతున్నా
నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు

ఏడారిలో గూడబాతునై
రెక్కలు తెగిన పక్షినై
దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు

దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై
ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు

ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై
శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మీగులకున్నా
ఈ పయనం ఆగనే ఆగదు యేసు
నా అడుగు జారనే జారదు

-------------------------------------------------------------------
CREDITS : Krupasana Ministries
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------