4633) మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం

** TELUGU LYRICS **

మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం
నీ ప్రేమకై మా జీవితం అంకితం
శ్రమలు సంభవించినా చెదరని విశ్వాసం
సర్వము కోల్పోయినా సడలని విశ్వాసం (2)
తరమబడుచున్ననూ విడువని విశ్వాసం
చంపబడుచున్ననూ చెరగని విశ్వాసం
మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా వందనం
నీ ప్రేమకై మా జీవితం అంకితం

దేవా వందనం మా ప్రభువా వందనం
యేసూ వందనం మా రక్షకా వందనం
క్రీస్తూ వందనం మా రాజా వందనం
నీ ప్రేమకై మా జీవితం అంకితం
||శ్రమలు||

కరువు ఖడ్గమైనను హింస బాధ అయినను
నీ ప్రేమ నుండి మమ్మును వేరు చేయలేవు (2)
ఉపద్రవం వస్త్ర హీనత ఎడబాపలేవు
ఆయుధం లోక శాశనం భయపెట్టలేవు
వధకు సిద్ధమైన గొఱ్ఱెల వంటి స్వభావులం
దినమెల్ల వధింపబడినను విడువం మా విశ్వాసం (2)
||దేవా వందనం||

నిను నమ్మిన భక్తులందరూ శ్రమల వలన పరీక్ష నొందగా
నీ కొరకు నిలిచారు విశ్వాస వీరులుగా (2)
అగ్ని జ్వాల నుండి వారు రక్షింపబడ్డారు
సింహముల నోట నుండి తప్పించబడ్డారు
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉండగా
నీ వైపు చూస్తూనే రక్షణను కొనసాగించెదం (2)
||దేవా వందనం||

లోకమంతా ఏకమై ఆశలు కలిగించినను
మమ్మును రక్షించిన నీ ప్రేమలో నిలిచెదము ( 2)
నీ రెక్కల చాటునే కడవరకు సాగెదము
నీ సన్నిధిలోనే తుదిశ్వాస విడిచెదము 
మాకై నిను పంపిన తండ్రికి మా వందనం
తన ప్రేమ నీలో చూపిన తండ్రికి వందనం.. (2)
||దేవా వందనం||

-------------------------------------------------------------------------------
CREDITS : Lyric, Tune : Dr. Y. Vijay Kumar
Music & Vocals : Prasanth Penumaka & Sis. Blessy 
-------------------------------------------------------------------------------