** TELUGU LYRICS **
అనురాగ బంధమా అత్మీయ శిఖరమా
మైమరచిపోయో మమతను
నాయెడల చూపిన యేసయ్యా
మైమరచిపోయో మమతను
నాయెడల చూపిన యేసయ్యా
దయనొందిన జీవితంలో
ఆపత్కాల సమయములో! నీ
శరణు వేడుకొనగా నా ముందు నిలిచితివే
నేనున్నాను నేనున్నానని అభయహస్తమిచ్చితివే
కరుణా చూపి కార్యము చేసితివి! నీ
సన్నిధిని సాక్షిగా నిలిపితివే
||అనురాగ||
నీ రక్తసంబంధునిగా మహిమ రాజ్య వారసునిగా
ఏర్పరిచి నావే నిన్ను నమ్మిన జనులను
కృపనొందిన ప్రజలమై నీ మందిరావరణములో
నాటబడిన పచ్చని ఒలీవగా
శ్రేష్టమైన వరముగా మార్చితివా
||అనురాగ||
నా తల్లి గర్భమందు నన్ను చూసి ఎరిగిన దేవా
బ్రతకమని చెప్పి నీఆత్మ నిచ్చితివే
నీ చిత్తము చేయుటకై నీ వార్త చాటుటకై
నీ మనస్సు నాలో నింపితివా
నీ వలె నన్ను మార్చితివా
||అనురాగ||
------------------------------------------------------
CREDITS :
Youtube Link : 👉 Click Here
------------------------------------------------------