** TELUGU LYRICS **
నీ కృప కనికరం మెండుగా కురిపించినావు
నీ దయ క్షేమము ఎన్నడు నను వీడలేదు
యేసయ్యా నీ ప్రేమానురాగము - కుమ్మరించెను వాగ్దాన వర్షము
మరువలేను క్షణమైనను - నిన్ను పొందుట నా భాగ్యము
భారమైన శ్రమలలో నా వల్ల కాదనుకొనగా
నిజముకాని నిందలన్ని దీవెనలుగా మార్చినావు (2)
నీ సన్నిధిలో నా దీనప్రార్ధన - మనవులు ఎన్నడు కాదనలేదే
మరువలేని ఆదరనిచ్చి ఓదార్చిన నా కన్నతండ్రివి - పరమతండ్రివి
నీ దయ క్షేమము ఎన్నడు నను వీడలేదు
యేసయ్యా నీ ప్రేమానురాగము - కుమ్మరించెను వాగ్దాన వర్షము
మరువలేను క్షణమైనను - నిన్ను పొందుట నా భాగ్యము
భారమైన శ్రమలలో నా వల్ల కాదనుకొనగా
నిజముకాని నిందలన్ని దీవెనలుగా మార్చినావు (2)
నీ సన్నిధిలో నా దీనప్రార్ధన - మనవులు ఎన్నడు కాదనలేదే
మరువలేని ఆదరనిచ్చి ఓదార్చిన నా కన్నతండ్రివి - పరమతండ్రివి
దివ్యమైన రాజ్యమునకు వారసునిగా మారాలని
హేయమైన మనుజాశలను ఆత్మశక్తితో ఎదురింతును (2)
సిద్ధపరచిన బహుమానము - జయించినవారికే సొంతము
మాటతప్పని మహనీయుడా - మారదు ఎన్నడు నిబంధన - నీ నిత్యనిబంధన
రక్షించితివి నీ దూతనంపి మరణఅంచులనుండి
జీవించెదను నమ్మకముగా ప్రాణమున్నంతవరకు (2)
గళమెత్తి పాడెద నీ శౌర్యము - ప్రచురపరతును నీ కార్యము
ఆసన్నము నీ ఆగమనము - నిన్ను చేరుట నా గమ్యము - నా జీవితగమ్యము
** ENGLISH LYRICS **
Nee Krupa Kanikaram Menduga Kuripinchinavu
Nee Daya Kshemamu Ennadu Nanu Veedaledu
Yesayya Nee Premaanuraagamu - Kummarinchenu Vagdhaana Varshamu
Maruvaleynu Kshanamainanu - Ninnu Pondhuta Na Bhagyamu
Bharamaina Sramalalo Na Valla Kaadanukonagaa
Nijamukaani Nindhalanni Deevenaluga Maarchinaavu (2)
Nee Sannidhilo Na Dheena Prardhana - Manavulu Ennadu Kaadanalede
Maruvaleni Aadaranichi Odharchina Na Kannathandrivi - Paramathandrivi
Divyamaina Rajyamunaku Varasuniga Maaralani
Heyamaina Manujaashalanu Aathamshakthitho Edhurinthunu (2)
Siddhaparachina Bahumanamu -Jayinchinavaraike Sonthamu
Maata Thappani Mahaneeyuda - Maradhu Yennadu Nibandhana - Nee Nithya Nibandhana
Rakshinchithivi Ne Doothanampi Marana Anchula Nundi
Jeevinchedanu Nammakamuga Pranamunnantha Varaku (2)
Galamethhi Paadeda Nee Shouryamu - Prachuraparathunu Nee Karyamu
Aasannamu Nee Aagamanamu -Ninnu Cheruta Na Gamyamu - Naa Jeevitha Gamyamu
-------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : K. Pradeep Kumar
Lyrics & Music : Pas. K.Prabhakar & K. Nava Jeevan Kumar
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------------------