** TELUGU LYRICS **
ఓటికుండను నేను నను ఓదార్చుము
ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి
నలుసైనాను నా వారికీ
గడిచి పోవునా నా గతి
మారి పోవునా నా స్థితి
ఒంటిగువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము
అలుసైనాను అందరికి
నలుసైనాను నా వారికీ
గడిచి పోవునా నా గతి
మారి పోవునా నా స్థితి
తలరాత ఇంతేనని తల్లడిల్లగ
తన చెయ్యి నను నడిపే మెల్ల మెల్లగా
తన గాయము నా కోసమే కదా
ఈ కాయము యేసుకోసమే సదా
ఈ కాయము యేసుకోసమే సదా
ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా
ప్రేమించిన నీ మనసునే గాయపరచగా
కనురెప్పయినా నను కాయకుండిన
కన్న తండ్రివి నను విడువకుంటివే
మీ లాగా నన్ను ఎవరు ప్రేమించగలరు
మీ లాగ నన్ను ఎవరు ఆదరించ గలరు
ఈ లోకమే ఏకమై నిలచిన
నా పక్షమై నీవుంటే చాలయ్య
--------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pauljacob
Music & Vocals : S.Ebenezer & D.Jessy
--------------------------------------------------------------