4581) యేసయ్య నీ జననమెంత చిత్రమో కనులారా దర్శించినోళ్ళ కెరుక

** TELUGU LYRICS **

యేసయ్య నీ జననమెంత చిత్రమో 
కనులారా దర్శించినోళ్ళ కెరుక 
హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... (2) 
ప్రభు యేసు పాకలో పుట్టినాడని ప్రకటించిన నోళ్లకు అంత ఎరుక 
హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ... హైలెస్సా...
ఆకాశమందున్న... ఓ... వింత చుక్క... హైలెస్సా... 
తూర్పు దేశజ్ఞానులను నడిపించే చుక్క ... హైలెస్సా (2) 
||యేసయ్య||

తల్లి అయినా మరియమ్మను చూసి హైలెస్సా
తన ఒడిలోన పవళించు శిశువును చూసి హైలెస్సా
బంగారు సాంబ్రాణి బోలమును తెచ్చి హైలెస్సా
నా యేసు పుట్టుకకు కానుకలిచ్చి హైలెస్సా
అత్యానంద భరితులాయే ఆనంద మానందమానందమాయే
||యేసయ్య||

గొర్రెల కాపరులు పొలంలో ఉండగా హైలెస్సా
దేవదూత రాత్రివేళ దర్శనమియ్యగా హైలెస్సా
మీ కొరకు పుట్టాడన్న సువార్త తెలుపగా హైలెస్సా
గొల్లలందరికి సంతోషమాయే ఆనంద మానందమానందమాయే
||యేసయ్య||

సర్వోన్నతమైన స్థలములలోన హైలెస్సా
నా దేవునికి మహిమయు కలిగేటివేళ హైలెస్సా
తనకు ఇష్టులైన మనుషులకేమో హైలెస్సా
భూమి మీద సమాధానం కలిగేటివేల హైలెస్సా
లోకమంతట సంతోషమాయే ఆనందమానందమానందం
హైలెస్సా... ఓ... హైలెస్సా... ఓ...హైలెస్సా... 
||యేసయ్య||

------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Divya
------------------------------------------------------------