4582) నింగిలోన చుక్క పుట్టే చుక్కేమో దారి చూపే తొంగి చూసే దూతలంతా

** TELUGU LYRICS **

నింగిలోన చుక్క పుట్టే చుక్కేమో దారి చూపే
తొంగి చూసే దూతలంతా చక్కనైన యేసు వైపే (2)
రారో రారో రారో రారన్న చిందేద్దాం
రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)
రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి 
లోకమంతా చాటేద్దాం
లోక రక్షకుని వార్త (2)
                       
రారో రారో రారో రారన్న చిందేద్దాం
రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)
||నింగి||

శిశువు చూడ ముచ్చటయ్యే - పొత్తి గుడ్డలతో చుట్టిరే
లోక పాపములు మోయ్యగా వెలిసే దైవం నరుడయ్యి
పశువుల పాకయ్యే ఉయ్యాల తొట్టిగ మారేనే
రక్షకుడే దీనుడై భువిలో వెలిసే ఈరేయే (2)
 
రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి
లోకమంతా చాటెద్దాం లోకరక్షుని వార్త (2)
రారో రారో రారో రారన్న చిందేద్దాం
రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)
||నింగి||

తూర్పుదిక్కు పుట్టిన  చుక్క
జ్ఞానులకే దారి చూపే
గగనము నుండి దూతలు కూడా - స్తోత్ర గానము చేసిరయ్యో
శరణు వేడి ఇచ్చిరయ్యో బంగారు సాంబ్రాణి బోళం
శరణం నీవని ఒప్పుకొని - ఎప్పుడు ఇత్తువు నీ హృదయం (2)
రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి
లోకమంతా చాటెద్దాం లోకరక్షుని వార్త (2)       
                         
రారో రారో రారో రారన్న చిందేద్దాం
రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)
                      
రాజు రారాజు పుట్టాడని రండి పండుగ చేద్దాం
ఇమ్మానియేలు ఏతెంచాడని భువిని సందడి చేద్దాం       
రాజు రారాజుగ పుట్టాడని రండి వేడుక చేద్దాం
ఇమ్మానియేలు ఉదయించాడని కలిసి ఆరాధిద్దాం

----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pilli Kumaraswamy
Music & Vocals : Gandham Praween & Tinnu
----------------------------------------------------------------------