4550) వెలిగింది ఒక తార నింగిలో క్రీస్తుయేసు జనన వార్త తెలుపను

** TELUGU LYRICS **

వెలిగింది ఒక తార నింగిలో
క్రీస్తుయేసు జనన వార్త తెలుపను
వెలగాలి నీవు ఈ లోకంలో
క్రీస్తు ప్రేమను రుచిచూపేలా
యేసే రక్షకుడని క్రీస్తే అబిషక్తుడని
తోడైయుండే దేవుడని ప్రకటించాలి
ఆశ్చర్యకరుడని బలమైనదేవుడని
ఆలోచన కర్తని ఆరాధించాలి

సర్వోన్నతమైన స్థలములలోనా
దేవునికే మహిమ కలుగునుగాక .

నసించుచున్న దానిని రక్షించుటకు 
దేవుడే దిగొచ్చినాడుగా        
అంధకారమందు వెలుగునింపుటకొరకు
నీతిసూర్యుడు ఉదయించెనుగా
క్రీస్తును దరియించినా వారందరు
ధరణిలో వెలగాలిగా
నీతిమార్గమందు అనేకులనుచేర్చగా
తారవలె వెలగాలిగా
యేసే దేవుడని ఆయనే సజీవుడని
పాపవిమోచకుడని ప్రకటించాలి  
అన్ని నామములకన్న పైనామమేసని
ప్రభువైన క్రీస్తును ఆరాధించాలి
||సర్వోన్నతమైన||

పరలోకమేలుచున్న మహరాజైనను
రిక్తునిగా అరుదెంచెనుగా
సర్వమానవాళిని రక్షించుటకు
తనప్రాణమర్పించెనుగా
క్రీస్తును నమ్మి వెంబడించువారు
సత్ క్రియలతో వెలగాలిగా
నరకాగ్నినుండి అనేకులను రక్షింప
సువార్తను ప్రకటించాలిగా
యేసే సత్యము యేసే జీవము
పరలోక మార్గమని ప్రకటించాలి
పరిపూర్ణుడేసని పరిశుద్దదేవుడని 
నీతిసూర్యుడేసని ఆరాధించాలి
||సర్వోన్నతమైన||

----------------------------------------------------------------------------
CREDITS : Music: Danuen Nissi
Lyrics, Tune : Ps. V. Satyam
Vocals: Satyam, Enoshpaul, Manasa & Keerthana
----------------------------------------------------------------------------