4551) బెత్లెహేం ఊరిలో బాలుడేసు జన్మించెను రాజులు నివసించు కోటలో కాదు

** TELUGU LYRICS **

బెత్లెహేం ఊరిలో బాలుడేసు జన్మించెను (4) 
రాజులు నివసించు కోటలో కాదు ఆ..ఆ..ఆ.. 
ధనికులు నివసించు భవంతిలో కాదు ఆ..ఆ..ఆ.. (2)
ఊరి చివర సత్రములో పశువుల పాకలో (2)
||బెత్లెహేం||

జ్ఞానులు ముగ్గురు నక్షత్రం చూచి ఆ..ఆ..ఆ.. 
యేసు జన్మించిన స్థలముకు చేరి ఆ..ఆ..ఆ.. (2)
బంగారము బొలమును సాంబ్రాణిని సమర్పించిరి (2)
||బెత్లెహేం||

గొల్లల మధ్యకు దూతలు  వెళ్ళి  ఆ..ఆ..ఆ.. 
యేసు జన్మించిన వార్తను చెప్పిరి  ఆ..ఆ..ఆ.. (2)
మిన్నులో మహిమ మన్నుపై సమాధానం (2)
మనుషుల ప్రేమ ఉండాలని 
||బెత్లెహేం||

------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Prof. Dr. Joel SGR Bhose
------------------------------------------------------------------------------------------------------