4530) ఉప్పొంగేనే హృదయం ఆనందంతో పులకించేనే పుడమి సంతోషంతో

** TELUGU LYRICS **

ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
రాజాదిరాజు జన్మించేఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే 
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
||ఉప్పొంగేనే||

చీకటిని తొలగించి మన బ్రతుకులో వెలుగును నింపే నీతి సూర్యుడై ఉదయించెను
బంధకములలోనుండి మనలను
విడిపించుటకు దేవుడే దీనుడై పుట్టెను (2)
సర్వలోకానికే సమాధానమే 
ధన్యమైన ఈ భువికెంతో పరవశమే
మహదానందమే ఇక సంతోషమే లోకరక్షకుడు మనకై జన్మించెను
||ఆశ్చర్య||

పరలోకసైన్యమే దూతలతో దిగివచ్చి 
సర్వోన్నత దేవుని ఆరాధించగా
తార దారిచూపగ గొల్లలు జ్ఞానులు
యేసుని చేరి పూజించగా (2)
సర్వలోకానికే ఈ శుభవార్తను
మనమంతా కలిసి ఇల ప్రకటింపగా 
రక్షణానందమే ఇక సంబరమే
మన హృదయాలలో క్రీస్తు జన్మించగా
||ఆశ్చర్య||

-----------------------------------------------------------------
CREDITS : Music : Siddu
Lyrics, Tune, Vocal : Siddu & Raji Lekhana 
-----------------------------------------------------------------