4574) తండ్రి దేవా పుత్ర దేవా ఆత్మ దేవా స్వాగతం

** TELUGU LYRICS **

తండ్రి దేవా పుత్ర దేవా ఆత్మ దేవా స్వాగతం
ఈ బలిపూజకు సుస్వాగతం (2)

మరియ తనయుడు కారు చీకటిని ఛేదించి జన్మించెను
ఇమ్మానుయేలు ఒంటరి బ్రతుకుకు తోడుండ ఉదయించెను (2)
కలతలు బాపగ ఈ భువికి ఏతెంచెను (2)
పాపిని రక్షింప ప్రేమతో అరుదెంచెను
సర్వోన్నత స్థలములలో నివసించు దేవునికి మహిమ
తనకిష్ఠులైన మనుజులకు శాంతి కలుగునుగాక (2)

తండ్రి ప్రేమకు ప్రతిరూపము యేసుని జన్మము
ఆత్మదేవుని చొరవకు ఇది శక్తియుక్తికి నిదర్శనం (2)
వినయమూర్తిగ దైవతనయుడు మనిషిగ మారెను (2)
త్రిత్వ దైవము ప్రణాళిక ఇది మానవాళికి రక్షణ 
||సర్వోన్నత||

ప్రవక్తలు ముందుగ ఎరుక పరచెను క్రీస్తుని రాకను
కన్యమరియ గర్భమందు రక్షకుడు జన్మించెను (2)
పుణ్య యోసేపు దైవ వాక్కుకు విధేయత చూపెను (2)
ప్రభుని చేరి ప్రణమిల్లి మ్రొక్కిరి గొల్లలు జ్ఞానులు 
||సర్వోన్నత||

------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Naveen Madiri
Lyrics & Vocals : Fr Pasala Elias & Harsha Vardhan Chavali
------------------------------------------------------------------------------------------