4573) ఆది దేవుడే అద్వితీయుడే పుట్టినాడు బెత్లహేములో

** TELUGU LYRICS **

ఆది దేవుడే అద్వితీయుడే పుట్టినాడు బెత్లహేములో 
నీతి సూర్యుడే నిర్మలాత్ముడే జన్మించే పశువుల పాకలో (2)
కన్య మరియ గర్భమందు ఇమ్మానుయేలుగా 
మన పాపం తొలగించే రక్షకుడైసయ్యగా (2)
రారాజు పుట్టినడయ్యోఓ ఓ రక్షణనే తెచ్చినాడయ్యోఓ ఓ (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ (2)

లోకాలనేలే రాజాధిరాజు పుట్టెను పుడమిపై బాలునిగా
ఆది అంతము లేనట్టి వాడు-అవతరించెను దీనూనిగా (2)
పరిశుద్ధుడే పరమును వీడి మన కోసం ఇలకోవచ్చేగా
సామాన్యుని గా సర్వాన్ని విడిచి నరరూప మెత్తనుగా
రారాజు పుట్టినడయ్యోఓ ఓ రక్షణను
తెచ్చినాడుయ్యోఓఓఓ
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్ (2) 

బంగారము సాంబ్రాణి బోళము తెచ్చినారు
ఇచ్చినారు తూర్పు జ్ఞానులు-నాట్యము లాడి 
స్తుతి పాటలు పాడి గొల్లలు చాటిరీ శుభవార్తను (2)     
సంతోషముతో మనమందరము చేరేదము కీర్తించెదము
ఆర్భాటము తో ఆరాధన చేసి సందడి చేసేదేము             
రారాజు పుట్టినడయ్యోఓ ఓ
రక్షణనే తెచ్చినాడయ్యోఓ ఓ
 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్

-----------------------------------------------------------------------
CREDITS : Music : Sangeeth Gummapu 
Lyrics & Singer : K.Divya, K.Mercy, K.Mahesh
-----------------------------------------------------------------------