4526) తార వెలిసేను ఆ నింగి చుక్కల నడుమ తార వెలసెను

** TELUGU LYRICS **

తార వెలిసేను 
ఆ నింగి చుక్కల నడుమ తార వెలసెను
తార వెలిసెను 
ఆ నింగి చుక్కల నడుమ తార వెలిసెను
ఇది యేసుని తార 
మది నింపిన ధార 
ఇది యేసుని తార
మది నింపిన ధార
ఆనందమే సంతోషమే ప్రభు యేసుని ద్వారా (2)
||తార||

బెత్లహేములోన చిన్న పసులపాకలోన 
బెత్లెహేములోన పసులపాకలోన
కన్య మరియ ధన్య గర్భాన 
యేసే జన్మించెను 
ప్రభు యేసే జన్మించెను
యేసే జన్మించెను
ప్రభు యేసు జన్మించెను 
ఆనందమే సంతోషమే
ప్రభు యేసుని ద్వారా 
ఆనందమే సంతోషం ప్రభు యేసుని ద్వారా 
||తార||

ఈ లోక పాపమంతా ఇదిగో యేసే మోయునంటా 
సర్వలోక పాపమంత తానే మోయుంట
లేఖనాల్లో రాసేనంటా
సర్వ లోక పాపామంతా తానే మోయునంట 
గొరెపిల్ల తానంటా 
ఆ క్రీస్తే జన్మించెను ప్రభు యేసే జన్మించెను
ఆ క్రీస్తే జన్మించెను ప్రభు యేసే జన్మించెను
ఆనందమే సంతోషమే ప్రభు యేసుని ద్వారా
||తార||

----------------------------------------------------------------------
CREDITS : Lyrics, tune, music : Jeevan David 
----------------------------------------------------------------------