4599) సంవత్సరములు గతియించుచుండ నను నూతన పరచుము యేసయ్య

** TELUGU LYRICS **

సంవత్సరములు గతియించుచుండ నను నూతన పరచుము యేసయ్య 
నీ రూపముకు మార్చుము 
హిమముకంటే తెల్లగా 
పరిశుద్ధ పరచుము నా రక్షకా 
||సంవత్సరములు||

దినదినంబు నీకు సమీపమై 
ప్రతి క్షణము నీ సిలువ మోయుచు  
వెనుక చూడకనే నేను సాగెదను    
సిలువను చూచుచునే గురిని చేరెదను 
నీ ఆత్మతో నను నింపుమా  
నీ సేవజేతును స్థిర పరచుమా

నూత్న మనసు నూత్న ఆత్మను 
నూత్న జీవమును నింపుమా దేవా 
రాతి గుండెనే మార్చుమేసయ్య  
మాంసపు గుండెనే అమర్చుమో దేవా 
నీ హృదయము నాకిమ్మయా 
లోకాన్ని నీకై సంపాదించెద

----------------------------------------------------------------
CREDITS : Music : G. Pradhamarao
Lyrics, Tune, Vocal : Dr. Akumarthi Daniel
----------------------------------------------------------------