** TELUGU LYRICS **
రక్షకుడు జన్మించాడు ఆరాధించెదము
దైవ మానవుడే పుట్టినాడూ సంతోషించెదము (2)
తారలే త్రోవ చూపినా- ప్రవచనాలె పల్కిన
జ్నానులే ఆరాధించిన - దేవదూతలె దిగివచ్చిన
||రక్షకుడు||
దైవ మానవుడే పుట్టినాడూ సంతోషించెదము (2)
తారలే త్రోవ చూపినా- ప్రవచనాలె పల్కిన
జ్నానులే ఆరాధించిన - దేవదూతలె దిగివచ్చిన
||రక్షకుడు||
పాపములో శాపములో పతనమై యుండగా
ప్రేమగల దేవునికి దూరమై యుండగా (2)
మన పాపమంతటినీ పరిహరింపనూ
దిగి వచ్చెను దేవునీ గొరియపిల్లగా
||రక్షకుడు||
వ్యాధులతో బాధలతో క్రుంగి యుండగా
అపవాది భంధకములో చిక్కి యుండగా (2)
తన శక్తితో నిన్ను విమోచింపనూ
అరుదెంచెను దేవుని అభిషిక్తునిగా
||రక్షకుడు||
శోకముతో చీకటిలో ఒంటరై యుండగా
ఆదరించు వారులేక రోదించుచుండగా (2)
నిత్యమూ నీ తోడై తానె నిలువనూ
ఇమ్మానుయేలుగ అవతరించెను
||రక్షకుడు||
ఆదరించు వారులేక రోదించుచుండగా (2)
నిత్యమూ నీ తోడై తానె నిలువనూ
ఇమ్మానుయేలుగ అవతరించెను
||రక్షకుడు||
------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics & Tune & Vocals: Sunil Gumpula
------------------------------------------------------------