4578) రక్షకుడు అవతరించెను కన్య మరియ గర్భమున ఇమ్మానుయేలే జన్మించెను

** TELUGU LYRICS **

రక్షకుడు అవతరించెను - కన్య మరియ గర్భమున
ఇమ్మానుయేలే జన్మించెను - బెత్లహేము గ్రామమున
జ్ఞానులు యేసును పూజించెను - స్తోత్రములు చేసెను
ఆనందమే ఎంతో ఆనందమే - సంతోషమే ఇక సంబరమే

చెంగుముట్టెను విశ్వాసముతో - చింతతీరెను యేసు రాకతో
బలముపొందెను బలహీనతలో - యేసునాధుని తాకినంతనే
రోగరుగ్మాత తొలగిపోయెను - వ్యాధి బాధలు దూరమాయెను
ఆనందమే ఎంతో ఆనందమే - సంతోషమే ఇక సంబరమే

చెంతచెరెను ప్రార్ధించగా - కన్నీటితో పాదాలు కడిగెను
పాపజీవితం మారిపోయెను - యేసునాధుని చేరినంతనే
పాపశాపము తొలగిపోయెను - దోషశిక్షలు దూరమాయేను
ఆనందమే ఎంతో ఆనందమే - సంతోషమే ఇక సంబరమే

చూడవచ్చెను ఉత్సాహముతో - మనస్సుమారెను యేసుమాటతో
మార్పుచేందెను ఒక్కక్షణములో - యేసునాధుడు అడుగుపెట్టాగా
ధనదాహము తొలగిపోయెను - దు:ఖదినములు దూరమాయేను
ఆనందమే ఎంతో ఆనందమే - సంతోషమే ఇక సంబరమే

-------------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune & Vocals : Bro. Joseph Yogesh
-------------------------------------------------------------------