4585) నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్య

** TELUGU LYRICS **

నూతన సంవత్సరములోకి 
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి 
నను దీవించిన యేసయ్య
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతున్నయ్య
నిను నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య  
||నూతన||

గడచిన కాలమంతా 
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను 
నీ కృపా క్షేమములనిచ్చి (2)
కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు (2)
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతునయ్య నిను
నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య
||నూతన||

పాతవి గతియింపజేసి 
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి 
నీ వాక్యముతో నడిపితివే (2)
మెళులతో తృప్తి పరచి
ఆనంద తైలముతో నింపి (2)
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు (2)
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతున్నయ్య నిను
నేను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య
||నూతన||

-----------------------------------------------------------
CREDITS : Music, Vocals : KJW Prem
Lyrics, Tune : Sis Rajani Das, Sathri 
------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments