** TELUGU LYRICS **
వచ్చేసింది క్రొత్త వత్సరం ఏమి తెచ్చింది మన కోసం
ఎవరికి తెలుసును ఓ నేస్తం యేసుకే తెలియును వాస్తవం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం
సాగిపొమ్ము విజయం సాధ్యం
ఎవరికి తెలుసును ఓ నేస్తం యేసుకే తెలియును వాస్తవం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం
సాగిపొమ్ము విజయం సాధ్యం
కొండలు లోయలుగల దేశం - కష్టము సుఖఃము వున్న వత్సరం
యెహోవా లక్ష్యించు దేశం - యేసయ్య రక్షించు వత్సరం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం
సాగిపొమ్ము విజయం సాధ్యం
వర్షము హిమము కురిసె దేశం - పాలు తేనెలు విరిసె వత్సరం
యెహోవా దర్శించు దేశం - యేసయ్య దీవించు వత్సరం
యేసు వైపు చూస్తూ ఓ నేస్తం
సాగిపొమ్ము విజయం సాధ్యం
----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Rev. Pandu. Prem Kumar
Tune & Music & Vocals: Dr. JK Christopher & Sharon sisters
----------------------------------------------------------------------------------------------