4553) మహారాజు పుట్టాడు మన కొరకే వచ్చాడు మరణఛాయ తొలగించు

** TELUGU LYRICS **

మహారాజు పుట్టాడు
మన కొరకే వచ్చాడు
మరణఛాయ తొలగించు
మహిమ తేజుడొచ్చాడు
మహిని శాంతి మనకు నివ్వ
మరియ గర్భమునుదయించేనని
బోలో రే హ్యాపీ క్రిస్మస్
బోలె రే మెర్రి క్రిస్మస్ (2)

మహా సంతోషకరమైన
సువర్తమానము అని
దానికిదే ఆనవాలని
తెలుపగ ఆ దూత
గొల్లలెల్లి ప్రభుని చూచి
ఆ వార్త ప్రచురము చేసిరని.
బోలో రే హ్యాపీ క్రిస్మస్
బోలో బోలో మెర్రి క్రిస్మస్ (2)

తూర్పుదిక్కు మెరిసెను తారా
జ్ఞానులకు తెలుపగ జాడ
ముందుండి నడిపెను వారిని
శిశువుండే స్థలమునకు
బంగారు సాంబ్రాణి బోళం
అర్పించి సాగిలపడిరి యని
బోలో రే హ్యాపీ క్రిస్మస్
బోలో బోలో మెర్రి క్రిస్మస్ (2)

ఇమ్మానుయేలుగా వచ్చాడు
ఇక మనకు తోడుగా ఉంటాడు
ఇష్టులుగా బ్రతికామంటే 
ఇచ్చును శాంతియని 
సంతసాల సంబరాలే
అంబరాలంటగా
బోలె రె హ్యాపీ క్రిస్మస్
బోలో బోలో మెర్రి క్రిస్మస్

------------------------------------------------------------------------
CREDITS : Music : David Brainard G
vocals : G.Prem Kishore, N. Hanok Vijaykumar
------------------------------------------------------------------------