4495) మహా మహిమగల దేవుడు మహిమ లోకమును విడిచెను

** TELUGU LYRICS **

మహా మహిమగల దేవుడు
మహిమ లోకమును విడిచెను (2)
మనుజావతారము ధరియించేను 
మట్టి లోకమునకు అరుదెంచెను (2)
చింతలన్ని.. చింతలన్ని.. 
తొలగిపోయేను చీకులన్ని ఎగిరిపోయెను (2)
||మహా మహిమగల||

చీకటితో నిండిన లోకములో
చెడిపోయి పడిఉండిన మనుషులతో (2)
చెలిమి చేయ అరుదేంచెను
నిండు కలిమి కలుగజేసెను (2)
||చింతలన్ని||

ఆకాశవీధులలో తార వెలిసెను
ఆశ్చర్యకరుని గూర్చి అవని తెలిపెను (2)
పరిశుద్ధుని యొక్క జాడ చూపెను
పసిడి కాంతి కలుగచేసెను (2)
||చింతలన్ని||

--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. Parishuddarao garu
Vovals & Music : Bro. Surya Prakash & Bro.Joshua Gotikala
--------------------------------------------------------------------------------------------