** ENGLISH LYRICS **
క్రీస్తు లేని క్రిస్మస్ పండగేనా?
పరిశుద్ధతలేని పండగ దండగే కదా?
క్రీస్తు ఇలకు వచ్చింది మనం ఇలా చెడిపోవడానికా?
లేక మనలను తనలా తీర్చి పరమునకు చేర్చడానికా?
ఇంటి పైన సుక్కే పెట్టి కడుపునిండా సుక్కే ఏస్తే
పండగని ఫుల్లుగా తిని ఎర్రిగా సిందులేస్తే
హంగులూ ఆర్భాటాలతో క్రీస్తు ఆజ్ఞ పాతరేస్తే (2)
దేవునికి అవమానమే ఎరుగవా సోదరా
ఐతే
దేవునికే మహిమ తెచ్చే క్రిస్మస్ ఏదో చెప్పవా ఆరే.. రే.. రే..
క్రీస్తుకే ఘనత తెచ్చే క్రిస్మస్ ఏదో చెప్పవా
యోసేపూమరియలోలే దేవునికి విధేయత చూపాలి
అలనాటి సుక్కావోలె మనిషిని క్రీస్తు వైపు నడపాలి
జ్ఞానుల బంగారమంటి నీ బ్రతుకు క్రీస్తుకే ఇవ్వాలి
అపొస్తులోలె ఆకలికోర్చి క్రీస్తుని ఆజ్ఞ నెరవేర్చాలి
దేవునికి మహిమ తెచ్చే క్రిస్మస్ ఇదే సోదరా!
అరె క్రీస్తుకే ఘనత తెచ్చే క్రిస్మస్ ఇదే సోదరీ!

మరీ
క్రీస్తునే సంతోషపెట్టే పండగ ఏదో చెప్పవా?
లోకానికి మేలు చేసే పండగేదో చెప్పవా?

కొందరిని రక్షించి అసలైన పండగే చేయాలి
బ్రతుకులోన క్రీస్తును చూపి అందరికీ మాదిరిగా ఉండాలి
క్రీస్తు కొరకు నిందలే భాగ్యమని ఎంచి గంతులేయాలి
క్రీస్తు సేవలో సజీవయాగమై పరము చేరాలి

క్రీస్తునే సంతోషపెట్టే పండగ ఇదే సోదరా
అరె లోకానికి మేలు చేసే పండగ ఇదే సోదరీ
దేవునికి మహిమ తెచ్చే క్రిస్మస్ ఇదే సోదరా!
అరె క్రీస్తుకే ఘనత తెచ్చే క్రిస్మస్ ఇదే సోదరీ

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Dr.P.Lazarus
Music & Vocals : Gideon Katta & Gideon Katta