4542) అరే నీకు నాకు దూత చెప్పెనంట చక్కనైన శుభవార్త

 ** TELUGU LYRICS **

అరే నీకు నాకు దూత చెప్పెనంట 
చక్కనైన శుభవార్త
అరె లోకులంత మురిసే రక్షణ  వార్త 
ముందుగ మనకంట (2)
ఆ బెత్లెహేమను పురమును చేరి - ప్రభువుని చూద్దామా
మనసారా దేవుని మహిమను గూర్చి -పూజలు చేద్దామా (2)

చలిగాలి సురుక్కుమంటూ కొరుక్కుతింటున్న
దారేమో గతుకులతోనే అతుక్కుపోతున్న (2)
మనసెంతో ఎంతో వింతగా గంతులు వేసి పాడేనే (2)
ఇక సాగాలి పోవాలి మెస్సయ్యను  చూడాలిలే హోయ్

చీకట్లో అడుగులు తడబడి నడకలు రాకున్నా
ముళ్ళున్న రాళ్లున్నా మరి ముందుకు పోదామా (2)
జగమంతా చల్లని దేవుని ఎన్నెల ఎలుగులు కురిసేనే (2)
ఇక సాగాలి పోవాలి మెస్సయ్యను చూడాలిలే హోయ్

-------------------------------------------------------
CREDITS : Tune: Vinod
Music & Lyrics : Anand & Lawrance
-------------------------------------------------------