4543) దూత గణము శుభవార్త చెప్పెనే వింతైన తారక వేడుక చూపించనే

** TELUGU LYRICS **

దూత గణము శుభవార్త చెప్పెనే
వింతైన తారక వేడుక చూపించనే
గొల్లలు జ్ఞానులు యేసయ్య మొక్కిరే
ఆనంద భరితులై ఆరాధించిరి
రక్షకుడు ఏసు పుట్టేనని
ప్రేమ ప్రతిరూపం యేసేనని

ఉన్నత స్థలములలో దేవునికి మహిమ
దైవ ప్రజలకు సమాధానమే కలుగును

పరలోక మార్గము మానవాళికి చూపించను
దైవ కుమారుడే ధరణిపై ఉదయించెను
మహిమన్ విడచెను మన మధ్యలో ఒకడాయెను
శ్రీమంతుడు యేసుడు శరీరధారియై వచ్చేనిల 
||ఉన్నత||

దేవుని దూతగా ఇహ పరమందు తోడుండను
దేవాతి దేవుడే పశువుల తొట్టెలు ఒదిగేనిల
ప్రేమ స్వరూపుడే హృదయ కోవెలలో కొలువుండను
నీతి సూర్యుడు యేసుడు వాక్య దారియై వచ్చేనిల
||ఉన్నత||

---------------------------------------------------------------
CREDITS : Music : Rajkumar
Lyrics, Tune, Vocals : Sudheer Kumarana
---------------------------------------------------------------