4540) ఆకాశన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలిసింది

ఆకాశన క్రీస్తు జన్మదినాన
అరుదైన తార ఆనాడు వెలిసింది
ఈ లోకాన చిమ్మచీకలోన 
నిన్ను ఒక తారగా
వెలగమని పాఠం చెబుతుంది
జ్ఞానులకే దారిని చూపే
నక్షత్రంలా మారాలంటుంది
క్రీస్తువైపే నడిపించేందుకు
తనలాగే నువు నడవాలంటుంది..
లోకులంతా ఆ వెలుగులో
యేసుక్రీస్తును గుర్తించాలంది
కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది
నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది 
||ఆకాశన||

ఇంటిమీద వెలిగే తారలా ఉండిపోతే ఏం లాభం?
వీధిలోన నిలిపే స్టార్ లా
ఎండిపోతే ఏం లాభం?
గాలిలోన కట్టేమేడలా
కూలిపోతే ఏం లాభం?
నీటిలోన మునిగే ఓడలా
బ్రద్దలైతే ఏం లాభం?
ఏడాదికి ఒక్కసారే వెలిగి ఆరిపోతావా?
నిరంతరం వెలిగే జ్యోతిలగా మారవా?
లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా?
మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండవా?
జీవవాక్యమును చేతబట్టి లోకమందు వెలగవా?
||ఆకాశన||

గాలివాటు రాని చోటులో
దీపముండి ఏం లాభం?
తేటకన్ను లేని మనిషిలో
ఊపిరుండి ఏం లాభం?
నూనె లేక ఆరిన దివిటితో
సిద్ధపడి ఏం లాభం?
చీకటిగా మారిన వెలుగుతో
దేవుడికి ఏం లాభం?
నీతిమార్గమున వెలిగి అనేకులకు త్రిప్పుదువా?
ఆకాశమండలంలో
జ్యోతివలే ఉంటావా?
రాజువైన యాజకునిగా
సమూహములో కనబడవా?
ఆశ్చర్యకరమైన 
వెలుగులోన నిలబడవా?
క్రీస్తును పోలి బ్రతికి
చివరివరకు ప్రకాశించవా?
||ఆకాశన||

---------------------------------------------
CREDITS : Vijay Prasad Garu
---------------------------------------------