4497) గోగో గొల్లలారా పరిశుద్ధుడేసు రాజు పుట్టెనే

** TELUGU LYRICS **

గోగో గొల్లలారా పరిశుద్ధుడేసు రాజు పుట్టెనే 
బేత్లేహేములో జోజోలపాడరే జగములనేలేటి
జనముల రారాజు యేసుకే (2)
యేసు మహారాజుకే - క్రీస్తు రారాజుకే (2) 
||గోగో||

ఘనుడై పుట్టినాడోయమ్మ - గగనమునుండి దిగినాడమ్మా (2)
ఇమ్మానుయేలుగా దేవుడేతోడుగా 
మన పాపముల బాప వచ్చినాడుగా(2) 
||గోగో||

చూడా చక్కనోడోయమ్మ~దివ్యసుందరుడే సోయమ్మ (2)
అందాల బాలుడు - అతికాంక్షనీయుడు
అరుదెంచినాడు - మనకోసమేగా (2) 
||గోగో||

తూర్పూ దేశ జ్ఞానులయమ్మ తారనువెంబడించినారమ్మ (2)
బంగారు సాంబ్రాణి బోళములర్పించి
క్రీస్తేసు బాలుని వేడిరంట (2) 
||గోగో||

---------------------------------------------
CREDITS : Peterson Boppuri
---------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments