4609) ఎన్నెన్నో మేలులు చేసిన దేవా నాకెన్నో మేలులు చేసిన దేవా

** TELUGU LYRICS **

ఎన్నెన్నో మేలులు చేసిన దేవా - నాకెన్నో మేలులు చేసిన దేవా (2)
నీ కేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును (2)
నా స్తుతులనే ధూపముగా - ఈ స్తుతులనే ధూపముగా 
మా స్తుతులనే ధూపముగా - చేసి అర్పింతు కానుకగా 
||ఎన్నెన్నో||

కార్యాన్ని చేసావు - భారాన్ని తీసావు - ధైర్యాన్ని పెంచావయ్యా 
మార్గాన్ని చూపావు - దుర్గంగ నిలిచావు - గమ్యాన్ని చేర్చావయా (2)
బహుశ్రమల మధ్యలోనా - మహోన్నతుడా తోడున్నావు (2)
నీకేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును 
||నా స్తుతులనే||

విజయాన్ని పొందగా - విశ్వాసమిచ్చావు - విడిపించుచున్నావయ్యా 
వింతైన ప్రేమతో - విసమంతా కడిగావు - విలువెంతో పెంచావయ్యా (2)
వాక్యముతో బలపరిచావు - వాగ్ధానము నెరవేర్చావు (2)
నీకేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును
||నా స్తుతులనే||

-----------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Kiran Kumar & Asha Kiran
Lyrics & Tune & Music : Ch Kiran Kumar & Prabhu Charan
-----------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments