4610) శతకోటి వందనాలు నా యేసయ్య గతమంతా నీ కృపలో కాచితివయ్యా

** TELUGU LYRICS **

శతకోటి వందనాలు నా యేసయ్య 
గతమంతా నీ కృపలో కాచితివయ్యా (2)
నూతన బలము నూతన శక్తి మాకొసగుమయ్యా 
ఎనలేని నీ ప్రేమని మాపై చూపించుమయ్యా
||శతకోటి||

శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు 
ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన (2)
కన్నీరు నాట్యముగ మార్చి వేసినావు 
మా తోడు నీవై నడిపించినావు (2)
||నూతన||

ఆత్మీయ యాత్రలో అలసి పోయినా 
నీ శక్తితో నింపి బలపరచినావు (2)
పక్షిరాజు వలె నన్ను  పైకెగురజేసి  
ఆకాశవీధిలో విహరింప జేశావు(2)  
||నూతన||

దినములు జరిగించుచుండగా 
నీ కార్యములు నూతనపరచుము నా యేసయ్య (2) 
ఈ సమయములో మెండైన దీవెనలు  
కురిపించుమయా కృప గల దేవా  (2)
||నూతన||

--------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------