4601) ఎందుకయ్యా నా మీద నీకంత ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ

** TELUGU LYRICS **

ఎందుకయ్యా నా మీద నీకంత ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ఎంత జాలిగుండె నీది నా ప్రియ యేసయ్యా
రాజా రాజా దయగల మహారాజా
ఏ పాపము ఎరుగని పావనమూర్తివి నీవు
నా పాపములను కడుగుటకే బలి అయినావు
కలువరి కొండపై సిలువలో వ్రేలాడి
మరణము పొంది సజీవుడవై లేచితివయ్యా
దేవాది దేవా నీకే స్తోత్రములయ్యా
రాజాధి రాజా స్తుతి వందనమయ్యా

నీవు నీతిమంతుడని రాజు నమ్మెను
కానీ మట్టి మనుషులైన మేము నమ్మలేకపోతిమి
మూఢ నమ్మకాలకు మేము బానిసలమైతిమి
నీ తలకు ముండ్లు గుచ్చుకున్నాగానీ తండ్రివై ప్రేమిస్తివి
నీయందున విశ్వాసముతో బలపడిన వారిని
తోకగా కాకుండా తలగా నిలిపి
న్యాయమై ధర్మమై తీర్పునిచ్చే దేవా
ఉన్నత శిఖరముపై నీ నామము లిఖియింతుమయ్యా
దేవాది దేవా నీకే స్తోత్రములయ్యా
రాజాధి రాజా స్తుతి వందనమయ్యా

నీ మందిరము మెట్లను ఎక్కే అర్హతే లేని మాకు
స్తుతి గానములు పాడే భాగ్యమే ఇచ్చితివి
మాట తీరు కూడా తెలియని వేలిముద్ర బతుకులు మావి
వాక్యములు చదువుతూ గొప్ప సాక్ష్యమై నిలబెడితివి
ఘణ స్తుతులకు అర్హుడవు అధికారములకు యోగ్యుడవు
కలలో మొరపెట్టినా ఉత్తరమిచ్చెదవు
బంధమై బాహువై బలమునిచ్చే దేవా
విశ్వమునంతా నీ వాక్యమునే ప్రకటింతుమయ్యా
దేవాది దేవా నీకే స్తోత్రములయ్యా
రాజాధి రాజా స్తుతి వందనమయ్యా

----------------------------------------------------------------------
CREDITS : Vocals : Sudarshanamma, Moses 
Lyrics & Music : Paster John & Anji Pamidi
----------------------------------------------------------------------