4568) బెత్లహేములో ఏసు పుట్టెను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి

** TELUGU LYRICS **

బెత్లహేములో ఏసు పుట్టెను 
పశువుల తొట్టిలో పరుండబెట్టిరి 
గొల్లలు చూసి సంతోషించిరి క్రీస్తు పుట్టేనని తెలియజేసిరి 
తూర్పున చుక్కను చూసి కదలిరి జ్ఞానులే ఇంటికి చేరవచ్చిరి
సాగిలపడియు పూజించిరి పెట్టెలు విప్పి కానుకలిచ్చిరి
రక్షకుడు ఆసీనుడాయను ఈ భూమిలోనా 
మోక్షకుడు అరుదించెను ఈ అవనిపైన 
విశ్వమంతా ఉప్పొంగిపోయెను ఆ రోజున 
ఆనందమై వెల్లువేరిసెను ఈ ధరణిపైన
||బెత్లహేములో||

ప్రవక్తలు పలికిన ప్రవచనములు క్రీస్తును సూచించెను 
నా వంటి ప్రవక్త మీలో నుండి వచ్చునని మోషే తెలిపెను 
యేషయ మొద్దు నుండి చిగురు పుట్టును 
వాని వేరుల నుండి అంకురమేదిగి ఫలించును 
ఏలయనగా శిశువు పుట్టును 
ఆయన మీద భారము ఉండను 
లోకాలను ఏలే రారాజు పుట్టిన చూడండి 
సమాధాన కార్తయని తనకు నామమండి 
అందరికీ ప్రభువుగా వచ్చి మోక్షం ఇచ్చనండి 
అందరికీ మాదిరి చూపి జీవించేనండి 
||బెత్లహేములో||

లోక పాపములు మొసియు రక్షించును ఈ ఏసు 
శాపములన్నియు తీసియు దీవించును మన యేసు 
ప్రతివాడు నశింపక నిత్యజీవము ఆయనిచ్చును 
పరమ తండ్రి చిత్తము జరిగించుయు దీవించును 
పరదైసులోనా పరలోకంలోనా భూమి మీద స్ఫూర్తి ఆయెను 
అందరికీ ఆద్యుడాయను ఈ భువిలోనా 
కొందరినైనా రక్షించమని యేసు పలుకులోన 
కొందరినైనా ప్రేమించమని తన మాటలోనా 
పరలోకపు విందు పాలు పొందమని ఆత్మ బోధలోనా
||బెత్లహేములో||

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : P.Srinivas garu
Music & Vocals : Bro.Samuel Morries & Nada Priya
-------------------------------------------------------------------------------