** TELUGU LYRICS **
బెత్లెహేములో పూరిపాకలో రక్షకుడు పుట్టినాడట
లోకమంతయు పండగంటగా చూడ రండి ఓ జనంగామా (2)
చీకటి పోయే వెలుగే వచ్చే విడుదల కలిగే జీవితాలకు
శాపము పోయి క్షేమము కలిగే యేసుని జననము ఎంత ధన్యము (2)
హృదయాన ఆనందమే జగమంతా సంబరమే (2)
బెత్లెహేములో పూరిపాకలో
భూమి మీద ప్రేమ లేనప్పుడు ప్రేమను పంచ ఇలా జన్మించెను

స్వార్దముతో లోకము నిండినప్పుడు కనికరమై ఇల లో ఉదయించెను (2)
ఇలాంటి దేవుడు దొరుకుట ధన్యత నమ్మిన వారికి సమాధానము ఇచ్చును (2)
హృదయాన ఆనందమే జగమంతా సంబరమే (2)
బెత్లెహేములో పూరిపాకలో
దుష్ట శక్తుల అందరి పరిపాలనలో అక్రమమే అధిగమిoచ్చే సమయములో

అన్యాయపు అదికారుల కాలములో మార్గము తప్పిన మనుస్యులలో (2)
రక్షకుడై ఇల జన్మించినాడు నిత్యజీవం తానే అన్నాడు (2)
హృదయాన ఆనందమే జగమంతా సంబరమే (2)
బెత్లెహేములో పూరిపాకలో రక్షకుడు పుట్టినాడట
లోకమంతయు పండగంటగా చూడ రండి ఓ జనంగామా (2)
రక్షకుడై ఇల జన్మించినాడు నిత్యజీవం తానే అన్నాడు (2)
హృదయాన ఆనందమే జగమంతా సంబరమే (2)
బెత్లెహేములో పూరిపాకలో రక్షకుడు పుట్టినాడట
లోకమంతయు పండగంటగా చూడ రండి ఓ జనంగామా (2)
-------------------------------------------------
CREDITS : Music : KY Rathnam