4500) ఆనందం ఆనందం సంతోషం సంతోషం యేసయ్య పుట్టాడని

** TELUGU LYRICS **

ఆనందం ఆనందం సంతోషం సంతోషం 
యేసయ్య పుట్టాడని (2)
లోకమంత వెలుగొచ్చెను 
యేసు రాకతో పులకించెను
ఈ లోకమంత వెలుగొచ్చెను 
యేసు రాకతో పులకించెను
రాజుల మా రాజు ప్రభువుల మా ప్రభువు లోకన్ని ఏలేటోడు పుట్టాడురో 
ఆనందం ఆనందం యేసు పుట్టనే ఆనందమాయనే 
సంతోషం సంతోషం యేసు పుట్టనే సంతోషమాయనే
ఆనందం ఆనందం యేసు పుట్టనే ఆనందమాయనే 
సంతోషం సంతోషం క్రీస్తు పుట్టనే సంతోషమాయనే
||ఆనందమానందం||

మంచుకురిసే వేళలో మసక బారిన చీకటిలో 
కన్య మరియ గర్భమున వెలుగు చూపగా ఉదయించే (2)
లోకమందున ఆ బాలుడే నరునిగా పుట్టెను (2)
తనను నమ్మిన వారిని యెల్లా (2)
పరముకు చేర్చునో 
||ఆనందం||

క్రీస్తు జన్మను ఆ గొల్లలు సంబరాలతో చాటించిరి 
పసిడి బోలము సాంబ్రాణితో జ్ఞానులెల్లరు ఘనపరచిరి 
క్రీస్తు జన్మను ఆ గొల్లలు సంబరాలతో చాటించిరి 
పసిడి బోలము సాంబ్రాణితో జ్ఞానులెల్లరు పూజించిరి 
ఈ శుభవార్తను చాటింపగా లెమ్ము ఓ సోదరా 
ఈ శుభవార్తను చాటింపగా లెమ్ము ఓ సోదరీ (2)
హ్యాపి క్రిస్మస్ మేరీ క్రిస్మస్ (2)
యేసు ఇల పుట్టెనో 
||ఆనందం||

-------------------------------------------------------
CREDITS : Music : KJW Prem
Lyrics, Tune, Vocals : Gopi Salagala
--------------------------------------------------------