4596) ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప

** TELUGU LYRICS **

ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప (2)
మహోన్నతుడా మహాఘనుడా మహిమాన్వితుడా సర్వోన్నతుడా (2)
ప్రాణేశ్వరా నీకే వందనం సర్వేశ్వరా నీకే స్తోత్రము (2)
ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప (2)

ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవు 
సంతృప్తితో నను నింపి నను పోషించినవాడవు నీవు (2)
నను కరుణించి నా మనవి ఆలకించి వాగ్ధాన భూమికి నడిపించితివి (2)
ఆనందమే ఆహా ఆశ్చర్యమే నా యెడ నీ కృప అద్భుతమే (2)
ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప (2)

గాఢాంధకారములో వెలుగు ఉదయింపజేసిన వాడవు
నీ చేతితో నను నడిపి నీ దండముతో నను ఆదరించి (2)
నను దీవించి క్షేమము అనుగ్రహించి మహిమ రాజ్యంలో నన్ను నిలిపితివి (2)
ఆనందమే ఆహా ఆశ్చర్యమే నా యెడ నీ కృప అద్భుతమే (2)
ఆదరించెను నీ కృప నను ఆశీర్వదించెను నీ కృప (2)

------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Jhonson Mosya
Music : Emmanuel Prem Kumar
------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments