4417) యేసు ప్రేమనే చూపిద్దాం యేసు లాగనే జీవిద్దాం


** TELUGU LYRICS **

యేసు ప్రేమనే చూపిద్దాం - యేసు లాగనే జీవిద్దాం 
లోకాన్నే మార్చేద్దాం... చలో
యేసు వార్తనే చాటేద్దాం - నశించు ఆత్మను మార్చేద్దాం 
యేసు సువార్తను ప్రకటిద్దాం... బోలో 
అ.ప: యేసయ్య సాక్షిగా జీవించుదాం - తన చిత్తం నెరవేర్చుదాం (2) 
యేసే రారాజని సర్వలోకానికి - ఎలుగెత్తి చాటించుదాం... (2) 
||యేసు||

యేసయ్య నామం ముక్తికి మార్గం - యేసయ్య సన్నిధి సంతోషం 
యేసయ్య వాక్యం జీవాహారం - యేసయ్యే మనకు ఆధారం 
||యేసయ్య||

యేసయ్య చరణం పాపికి శరణం - యేసయ్య చిత్తం చిరజీవం 
యేసయ్యే మార్గం సత్యం జీవం - యేసయ్య వలనే పరలోకం 
యేసయ్య రాకకు సిద్ధపడుదాం - ఆత్మలను సిద్ధపరచుదాం (2) 
యేసే రారాజని సర్వలోకానికి - ఎలుగెత్తి చాటించుదాం (2) 
||యేసయ్య||

------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా) 
------------------------------------------------------------------------------------