** TELUGU LYRICS **
యెహోవాయే నా బలము - యెహోవాయే నా శైలము
యెహోవాయే నా కోటయు - యెహోవాయే నా కేడెము
అ.ప: యెహోవాయే నా శృంగము - యెహోవాయే నా దుర్గము
||యెహోవాయే||
యెహోవాయే నా కోటయు - యెహోవాయే నా కేడెము
అ.ప: యెహోవాయే నా శృంగము - యెహోవాయే నా దుర్గము
||యెహోవాయే||
నా దీపము ఆరనీయక - నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా - నన్ను నడిపించెను
నా చేతులు యుద్ధము చేయ- నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి - నన్ను గెలిపించెను
||యెహోవాయే||
నాకు బలము అనుగ్రహించి - నన్ను దృఢపరిచెను
నా శత్రువులకంటె నన్ను బహుగా - తానే హెచ్చించెను
నా జనులను నాకు లోపరచి - నన్ను ఘనపరచెను
ముందుగా తానే నడచి - నన్ను నడిపించెను
||యెహోవాయే||
------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా)
------------------------------------------------------------------------------------