** TELUGU LYRICS **
వరమై - వెలిసే
దైవమే - ఇలపై
దైవమే - ఇలపై
మార్గమై - సత్యమై
జీవమై - కుమారుడై
జీవమై - కుమారుడై
కన్నె గర్భమునందు ఒదిగెను - ఈ పాపికై
కడుపేద ఒడిలోన పవళించెను - దీనుడై
కృపతో మనలా రక్షింపను - విజయుడై
కరుణ శీలుడు జనియించెనూ - మనుజుడై
కోరస్: సర్వోన్నతో స్థలములలో - ప్రభుయేసునకే మహిమా
సమాధాన మొసగె - ప్రభుక్రీస్తునకే మహిమా!
అంధకారము తొలగింపనూ - వెలుగై
అపవాది బంధకం - తెంపను ధీరుడై
ఆదాము పాపమున్ క్షమియింపనూ - రిక్తుడై
అతి ప్రేమ చూపగా - అరుదెంచెను భూమిపై
||సర్వోన్నత||
రక్షణ కరమగు దైవకృపగా - ప్రత్యక్షమై
దుష్టత్వము నుండి మళ్లించే - దీవెనై
నిత్యజీవము నొసగే - సంపూర్ణుడై
సత్యవంతుని ఎరుగనూ - జ్ఞానమై
||సర్వోన్నత||
----------------------------------------------------------
CREDITS : Lyrics : Sis. Deepa Mallela
Music : Bro. Jakie Vardan
-----------------------------------------------------------